నేపాల్(NEPAL)ను వరుస భూకంపాలు(EARTHQUAKE) భయపెడుతున్నాయి. రెండురోజుల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో
స్థానికులు భయాందోళన చెందుతున్నారు. నివాసాల నుంచి బయటకు వచ్చి వీధుల్లోనే
పడిగాపులు పడుతున్నారు. కఠ్మాండులో రెండురోజుల కిందట 6.1 తీవ్రతతో భూమి
కంపించింది. ప్రాణ, ఆస్తినష్టం జరగలేదు.
ఈ తెల్లవారు జామున
కూడా భూమి మరోసారి ప్రకంపించింది. రిక్టర్ స్కేలు పై 4.1గా భూకంప తీవ్రత నమోదైంది.
భయభ్రాంతులు చెందిన నేపాలీయులు ఇళ్ళ నుంచి పరుగులు తీశారు. కఠ్మాండుకు ఉత్తర, ఈశాన్య దిశగా 393 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించినట్లు జాతీయ
భూకంప కేంద్రం గుర్తించింది. ప్రాణ, ఆస్తి నష్టానికి
సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు.
టిబిటెన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే నేపాల్లో భూకంపాలు తరుచూ
వస్తుంటాయి.
2015లో సంభవించిన భూకంపంతో ఆ
దేశం తీవ్రంగా నష్టపోయింది. వేల సంఖ్యలో నివాసాలు నేలకూలగా దాదాపు 9 వేల మంది
ప్రాణాలు కోల్పోయారు.