Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home అంతర్జాతీయం

‘ప్రపంచ ఇస్లామిక్ ఉగ్రవాదులారా ఏకం కండి, యూదు జాతిని తుడిచిపెట్టేయండి’

param by param
May 11, 2024, 06:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Al Qaida, ISIS praise Hamas

ఒకప్పుడు ఉగ్రవాద నాయకత్వం కోసం పరస్పరం పోరాడుకున్న సంస్థలు ఇప్పుడు
జట్టు కట్టాయి. పాలస్తీనా-ఇజ్రాయెల్‌ కుంపట్లో మంటలను ఎగదోస్తున్నాయి. హమాస్‌కు అండగా
నిలుస్తూ… యూదులపై దాడులకు తాము సైతం సిద్ధమంటున్నాయి.

యూదులు, ఇజ్రాయెలీలు, అమెరికన్లను లక్ష్యం చేసుకుని దాడులు చేయాలంటూ
అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ సంస్థలు తమ అనుచరులకు పిలుపునిచ్చాయి. ఇది
మధ్యప్రాచ్యంలో ప్రజ్వరిల్లుతున్న హింసను మరింత పెంచే పరిణామం మాత్రమే కాదు,
పాశ్చాత్య ప్రపంచంపై ప్రత్యక్ష దాడే.

గత రెండువారాలుగా అల్‌ఖైదా అనుబంధ సంస్థలు చేస్తున్న ప్రకటనలను
గమనిస్తే, అవన్నీ ఇజ్రాయెల్‌ను ‘ఆక్రమించినందుకు’ హమాస్ సంస్థను అభినందిస్తూ
వెలువడిన సందేశాలే. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1400 మందిని
హతమార్చినందుకు హమాస్‌ను అల్ ఖైదా ప్రశంసించింది.

అదే సమయంలో, హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన
సైనికచర్యలో 4500 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం యావత్ ఇస్లామిక్ ప్రపంచాన్నే ఆగ్రహావేశాలకు
గురిచేసింది. ప్రత్యేకించి, హమాస్ అధీనంలో ఉన్న ప్రాంతంలో ఇంత భారీ నష్టం జరగడంపై
ముస్లిందేశాలు మండిపడుతున్నాయి. ఆ సందర్భాన్ని ఉగ్రవాద సంస్థలు తమకు అనుకూలంగా
మార్చుకున్నాయి.  

‘‘మధ్యప్రాచ్యంలో ఘర్షణ పాలస్తీనా భూమి కోసం ఇస్లామిక్ వర్గాల మధ్య
పోరు మాత్రమే కాదు… అది మొత్తం ఉమ్మా ముస్లిములు చేస్తున్న యుద్ధం’’ అని అల్
ఖైదా అనుబంధ సంస్థ, సొమాలియా దేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న ‘అల్ షబాబ్’ వివరించింది.

అల్ షబాబ్ తన ప్రకటనలో ‘‘ముస్లిములు కలిసికట్టుగా ఉండాలి. యూదులు,
వారికి అనుకూలంగా నిలిచిన  స్వార్ధపర
ద్రోహులకు వ్యతిరేకంగా నిలిచిన ముజాహిదీన్లకు అండగా నిలవాలి. ఇక్కడి జిహాదీల బలమే ఈ
దేశపు బలం’’ అని పిలుపునిచ్చింది. భారత ఉపఖండం, యెమెన్, సిరియాల్లోని అల్‌ఖైదా అనుబంధ
సంస్థలు కూడా ఇటువంటి ప్రకటనలే చేసాయి.

ఆఫ్రికా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని అల్‌ఖైదా విభాగాలు ఇజ్రాయెల్‌పై
హమాస్ దాడిని ప్రశంసల్లో ముంచెత్తాయి. అంతటితో ఆగక, యూదులపై మరింత హింసకు
పాల్పడాలని పిలుపునిచ్చాయని ‘లాంగ్ వార్ జర్నల్’ వెబ్‌సైట్ వెల్లడించింది.

ఈ ఉగ్రవాద సంస్థల నినాదాలు అతివాద హింసను మరింత ప్రేరేపిస్తాయని
పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందుతున్నాయి. యూదులు, ఇజ్రాయెలీలు లేక వారికి మద్దతుగా
నిలుస్తున్న దేశాలకు హమాస్ లేదా ఇరాన్ నుంచి ముప్పు పొంచివుందని బ్రిటిష్ గూఢచారి
సంస్థ ఎంఐ5, అమెరికన్ ఎఫ్‌బీఐ అధినేతలు భావిస్తున్నారు. గాజాలో యుద్ధం ప్రారంభం
కంటె చాలా ముందు నుంచే ఐరోపాలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెరుగుతోందని యూరోపియన్
అధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు.

ఆన్‌లైన్ ఉగ్రవాద పాఠాలతో ప్రేరేపితులై స్వయంగా ఉగ్రవాద బాట
పట్టినవారు ఇంగ్లండ్‌లో అనూహ్యమైన సందర్భాల్లో అనూహ్యమైన దాడులకు పాల్పడే ప్రమాదం
పొంచివుందని ఎంఐ5 డైరెక్టర్ జనరల్ కెన్ మెకల్లమ్ చెప్పారు.

ఐరోపా ఖండానికి ఐసిస్ ఉగ్రవాద దాడుల
ముప్పు పొంచివుందని మే నెలలో నెదర్లాండ్స్ భద్రతావిభాగం హెచ్చరించింది. ఆ నెలలోనే,
ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రమాదకరంగా పెరుగుతోందనీ, తమ దేశాన్నీ, తమ పొరుగు దేశాలనూ లక్ష్యంగా
చేసుకున్నారనీ ఫ్రాన్స్ హోంమంత్రి ప్రకటించారు. తాజాగా ఈ నెలలోనే ఫ్రాన్స్‌లో ఐసిస్
ఉగ్రవాది ఒకరు ఒక టీచర్‌ను పొడిచి చంపేసాడు. బ్రసెల్స్‌లో ఒక అతివాది ఇద్దరు
స్వీడిష్ జాతీయులను కాల్చి చంపేసాడు.

‘‘ప్రస్తుతానికి ఈ సంస్థల పిలుపులకు
కొద్దిమంది మాత్రమే స్పందిస్తున్నట్లు కనబడవచ్చు. కానీ యుద్ధం జరుగుతూన్నకొద్దీ
మరింత వ్యవస్థీకృతమైన ప్రణాళికలు బైటపడతాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ పరిస్థితులను
ఈ గ్రూపులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి. స్థానికంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ
మద్దతు కూడగట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాయి’’ అని బ్రిడ్జ్‌వే ఫౌండేషన్ సీనియర్
విశ్లేషకుడు సేలెబ్ వీస్ వివరించారు.

ఇజ్రాయెల్‌లో యూదులపై పోరాటానికి ఐసిస్,
హమాస్‌కు కొన్ని సూచనలు చేసింది. అదే సమయంలో ఇరాన్‌తో హమాస్ సంబందాలు కలిగి
ఉండడాన్ని తీవ్రంగా విమర్శించింది. అలాగే, హమాస్ తమ దృష్టిని కేవలం ఇజ్రాయెల్‌లోని
యూదులకే పరిమితం చేయడాన్ని ఐసిస్ తప్పుపట్టింది. ఈ ప్రపంచంలో ఏ మూలనైనా యూదులు
ఉండనీ, వారిపై దాడులు చేయాల్సిందేనని ఐసిస్ భావన. మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికా,
ఐరోపా ఖండాల్లో ఉన్న యూదులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా
నిర్మూలించాల్సిందే అన్నది ఐసిస్ ఆలోచనా ధోరణి. హమాస్‌ అలా పనిచేయాలని ఐసిస్
సూచిస్తోంది.

అల్‌ఖైదా గతంలో హమాస్, హెజ్బొల్లా
వంటి సంస్థలను తీవ్రంగా వ్యతిరేకించేది. గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాల్లో ఆ
సంస్థకు ఉనికే లేదు. అల్‌ఖైదా లక్ష్యాలు, ఆలోచనలూ కొంతవరకూ హమాస్, హెజ్బొల్లా
ధోరణులతో కలిసినట్లు ఉన్నప్పటికీ వాటిమధ్య విస్పష్టమైన సైద్ధాంతిక విభేదాలు ఉండేవి.
ఉదాహరణకి, తమతమ దేశాల్లోని పరిపాలనా వ్యవస్థల్లో హమాస్, హెజ్బొల్లా జోక్యం కలిగించుకుంటాయి,
ప్రమేయం కలిగి ఉంటాయి. ఆ విధానానికి అల్‌ఖైదా ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండేది.

అలాగే, అల్‌ఖైదా, ఐసిస్ మధ్య తీవ్రమైన
శత్రుత్వం ఉండేది. సైద్ధాంతికంగా తమదే పైచేయి అని చెప్పుకుంటూ ఉండే ఆ సంస్థలు,
ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం తీవ్రంగా కొట్టుకునేవి. తమ సంస్థలోకి కొత్తవాళ్ళను
ఆకర్షించుకునే ప్రయత్నాల్లో పోటీ పడుతుండేవి. కానీ గత కొన్నేళ్ళుగా ఈ రెండు
సంస్థలూ గణనీయంగా బలహీనపడ్డాయి. సిరియా, ఇరాక్ దేశాల్లో ఐసిస్ తన సామ్రాజ్యాన్ని
కోల్పోయింది. అల్‌ఖైదా అగ్రనేత ఏమాన్ అల్ జవాహిరీ గతేడాదా డ్రోన్ దాడిలో
హతమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో పరస్పరం సహకరించుకుని, ప్రపంచాన్ని నాశనం
చేయడానికి చేతులు కలుపుతున్నాయి. ఇది కేవలం ఇజ్రాయెల్‌కే, మొత్తం ప్రపంచానికే
ఆందోళన కలిగించే పరిణామం.

ShareTweetSendShare

Related News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్
general

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు
general

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా
general

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు
general

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు
general

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

Latest News

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

యుద్ధం మొదలవక ముందే ఆర్థిక సాయం కోసం అడుక్కుంటున్న పాకిస్తాన్

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

విశాఖ నుంచి అబుదాబికి విమాన సేవలు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణంలో మరో ముగ్గురికి సిట్ నోటీసులు

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

ఐపీఎల్ 2025 నిరవధిక వాయిదా

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

తెలుగు జవాన్ వీరమరణం : తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబునాయుడు

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

‘ఆపరేషన్ సిందూర్‌’పై కేంద్రాన్ని అభినందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు కథనాలు : ఏటీఎంలు మూసివేయలేదు.. పెట్రోల్ డీజిల్ కొరత లేదు

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పాకిస్తాన్, తిప్పికొడుతున్న భారత్

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

ఉగ్రవాదుల చొరబాటును అడ్డుకున్న సైన్యం : ఏడుగురు హతం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

గత రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రి: పాక్ ప్రయోగించిన డ్రోన్లు, ఫైటర్ జెట్‌ల ధ్వంసం

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.