UP CM on Sanatana Dharma, Yogi performs Kanya Puja
‘‘సనాతన ధర్మం దుష్టశక్తులను ఎప్పుడూ సవాల్‌గానే
స్వీకరించింది, దేశ క్షేమం, ప్రజల సంక్షేమం కోసమే పనిచేసింది’’ అన్నారు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. శరన్నవరాత్రుల్లో తొమ్మిదవరోజైన ఇవాథళ
మహర్నవమి సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
‘‘రేపు విజయదశమి. ధర్మం, సత్యం, న్యాయం విజయం సాధించిన
సందర్భంగా జరుపుకునే పండుగ అది. ప్రతీ యుగంలోనూ ప్రతీ సందర్భంలోనూ దుష్టశక్తులు
ఎక్కువ ప్రభావవంతంగా కనిపిస్తాయి. అలాంటి ప్రతీ సందర్భంలోనూ ఆ దుష్టశక్తుల సవాల్‌ని
సనాతన ధర్మం అంగీకరించి, స్వీకరించింది. దేశక్షేమం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం
పాటుపడింది. అదే మానవత్వానికి బాటలు వేస్తుంది’’ అని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు.
గోరక్షాపీఠాధీశ్వరుడు ఆదిత్యనాథ్ ఇవాళ గోరఖ్‌పూర్‌లో
కన్యాపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారి బాలికలకు కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన
జల్లుకున్నారు. నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తుంది. దానికి
ప్రతీకగా ఆదిత్యనాథ్ కన్యాపూజలో తొమ్మిదిమంది చిన్నారుల పాదప్రక్షాళన చేసారు. వారి
నుదుటన సిందూర తిలకం పెట్టారు. చివరిగా వేదమంత్రాలు చదువుతూ వారికి హారతి ఇఛ్చారు.
పూజ పూర్తయాక తర్వాత యోగి ఆ బాలికలకు గోరఖ్‌నాథ్ ఆలయంలో వండిన ఆహారాన్ని స్వయంగా
తానే వడ్డించారు.
ఆ తొమ్మిది మంది బాలికలకే కాక మందిరానికి వచ్చిన
చిన్నారి పిల్లలందరికీ యోగి ఆదిత్యనాథ్ పూజ చేసారు, హారతి ఇచ్చారు. గోరఖ్‌నాథ్
మందిరంలో ఏర్పాటు చేసిన కన్యాపూజ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఆ పిల్లలందరికీ
దక్షిణలిచ్చారు. కానుకలు పంచారు. కన్యాపూజ పూర్తయిన తర్వాత యోగి స్థానిక ఆలయ
సంప్రదాయం ప్రకారం బతుక్ పూజ కూడా చేసారు. ‘బతుక్’లు కాలభైరవుడి ప్రతిరూపాలు.
ఈ కార్యక్రమాలకు ముందు యోగి ఆదిత్యనాథ్, శరన్నవరాత్రుల్లో
ఆఖరిదైన మహర్నవమి సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలోని శక్తిపీఠంలో ‘సిద్ధిధాత్రి’
అవతారంలోని అమ్మవారిని అర్చించుకున్నారు.