పారా ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. మొదటి రోజే 11 పతకాలు సాధించి పట్టికలో రెండో స్థానంలో నిలిచారు. తొలి రోజు క్రీడల్లో నాలుగు స్వర్ణాలు, ఐదు రజతాలు, రెండు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మొత్తం 11 స్థానాలతో చైనా తరవాత భారత్ నిలిచింది. పురుష క్రీడాకారులు 8, మహిళల విభాగంలో 2, మిక్స్‌డ్‌లో మరో 2 పతకాలు సాధించారు.
మహిళల పారా మనోయింగ్ పోటీల్లో రజతం, పురుషుల క్లబ్ త్రో ఎఫ్ 51 ఈవెంట్లో మూడు పతకాలు సాధించారు. షాట్‌పుట్‌లో భారత క్రీడాకారుడు కాంస్యం సాధించాడు. మిక్స్డ్ 50 మీటర్ల ఎయిర్‌రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ రుద్రాన్ష్ ఖండేల్వాల్ రజతం కైవసం చేసుకున్నాడు.
మహిళల 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో అవని లేఖారా స్వర్ణ పతకం గెలుచుకుంది. హైజంప్‌లో శైలేష్ కుమార్ స్వర్ణం, మరియప్పన్ తంగవేలు రజత పతకం గెలుచుకున్నారు. శైలేష్ 1.82 మీటర్లు, తంగవేలు 1.80 మీటర్లు దూకారు. 32 పతకాలతో చైనా మొదటి స్థానంలో ఉంది.