బీజేపీకి రాజీనామా చేసిన నటి గౌతమి
సినీ నటి గౌతమి బీజేపీకి రాజీనామా చేశారు. తనకు ద్రోహం చేసిన వ్యక్తికి కొందరు పార్టీ నేతలు సహాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ‘‘ఈ రోజు నేను నా జీవితంలో ఊహించని సంక్షోభంలో ఉన్నాను, అయినా పార్టీ నుంచి, నాయకుల నుంచి ఎటువంటి మద్దతు లభించలేదు,నన్ను మోసం చేసిన వ్యక్తికి కొందరు బీజేపీ నాయకులు సహాయం చేస్తున్నారని ’’ ఆమె ఎక్స్‌లో ఓ లేఖను పోస్ట్ చేశారు. తన డబ్బు, ఆస్తి కాజేసిన అలగప్పన్ అనే వ్యక్తికి బీజేపీ నాయకులు మద్దతు ఇస్తున్నారని ఆమె ఆరోపించారు.
చాలా బాధతో పార్టీని వీడుతున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైకు రాజీనామా లేఖ పంపారు. 20 సంవత్సరాల కిందట తల్లిదండ్రులను కోల్పోయిన నేను, అలగప్పన్ అనే వ్యక్తికి భూములకు సంబంధించిన పత్రాలు అప్పగించాను, అతను నన్ను మోసం చేశాడని గౌతమి (actress gowtami)ఆరోపించారు. తాను ఒంటరి మహిళగా, ఒంటరి తల్లిగా న్యాయం కోసం పోరాడుతున్నట్లు ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు.