గత శుక్రవారం ఢిల్లీలోని తిలక్ నగర్‌లో చోటు చేసుకున్న స్విస్ మహిళ హత్య (Swiss Woman Murder)లో మానవ అక్రమ రవాణా కోణంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్‌ప్రీత్‌సింగ్ పిలుపు మేరకు స్విట్జర్లాండ్‌కు చెందిన నినా బెర్జర్ ఢిల్లీ వచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు గుర్‌ప్రీత్‌సింగ్ ఫోన్ డేటాలో డజన్ల కొద్దీ మహిళల ఫోన్ నెంబర్లు, ఫోటోలు ఉండటంతో పోలీసులు మానవ అక్రమ రవాణా కోణంపై విచారణ జరుపుతున్నారు. గుర్‌ప్రీత్‌సింగ్ ఇంటి నుంచి పోలీసులు రూ.2కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు ఖాతాల్లోనూ పెద్ద మొత్తంలో నగదు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
గుర్‌ప్రీత్‌సింగ్ ఇంటి నుంచి మూడు తుపాకులు, పేలుడు పదార్ధాలు, 12 సిమ్ కార్డులు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఇతర కేంద్ర
సంస్థల విచారణ కోసం వారికి సమాచారం అందించారు. అతను వాడుతున్న కారు ఓ సెక్స్ వర్కర్ పేరుతో ఉందని గుర్తించారు. గుర్‌ప్రీత్‌సింగ్ మహిళల అక్రమ రవాణా చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఓమెగ్లీ చాటింగ్ యాప్ ద్వారా స్విస్ మహిళ నైనా పరిచయం అయినట్లు గురుప్రీత్‌సింగ్ పోలీసుల విచారణలో వెల్లడించారు.అతను కూడా అనేక సార్లు
స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. నైనాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు సింగ్ పోలీసులకు తెలిపారు. కానీ ఆమెకు ఇతరులతో సంబంధాలున్నాయనే అనుమానంతో, భారత్‌కు పిలిపించుకుని దారుణంగా హత్యచేసి ఆమె శవాన్ని రోడ్డుపై పడేసినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైంది.
నైనాను హత్య చేసిన సింగ్ ముందు ఆమె శవాన్ని కారులో ఉంచారు. దుర్వాసన రావడంతో సమీపంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో రోడ్డుపై పడేశాడని
సీసీ టీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో నిందితుడు తరచూ మాటలు మారుస్తున్నాడని పోలీసులు తెలిపారు.