భారత్ ఖాతాలో మరో విజయం నమోదైంది. సమ ఉజ్జీగా భావించిన న్యూజీలాండ్ జట్టును ఓడించి భారత్ అజేయంగా నిలిచింది. వన్డే ప్రపంచకప్లో ఆడిన ఐదు మ్యాచ్ల్లో భారత్ విజయకేతనం ఎగురవేసింది. ఆదివారం భారత్, న్యూజీలాండ్ మధ్య జరిగిన పోరు ఉత్కఠను రేపింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ జట్టు 50 ఓవర్లలో 273 చేసింది. ఆ జట్టులో మిచెల్ 127 బంతుల్లో 130 పరుగులు, రచిన్ రవీంద్ర 87 బంతుల్లో 75 పరుగులు చేసి సత్తాచాటుకున్నారు.
274 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ (Bharat) మొదట తడబడ్డా తరవాత నిలబడింది. 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత జట్టులో విరాట్ కోహ్లీ 104 బంతుల్లో 95 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. రోహిత్ శర్మ 40 బంతుల్లో 46, జడేజా 44 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న షమి 5 వికెట్లు తీసి న్యూజీలాండ్ జట్టు దూకుడుకు కళ్లెం వేశాడు. వచ్చే ఆదివారం భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది.