ధర్మశాలలో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్ (cwc-2023 Bharat vs nz ODI)ఈ
పోరులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఆటగాళ్లు డేవన్ కాన్వే,
విల్ యంగ్ ఓపెనర్లుగా ఇన్నింగ్స్ ప్రారంభించగా బూమ్రా మొదటి ఓవర్ సంధించాడు. ఓవర్
మెయిడిన్ కావడంతో కివీస్ ఖాతా తెరవలేదు. రెండో ఓవర్లో 5 పరుగులు రాబట్టారు. సిరాజ్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి డేవన్
కాన్వే డకౌట్ అయ్యాడు. ఫ్లిక్ చేయబోయి శ్రేయస్ కు చిక్కాడు.
వరల్డ్ కప్
లో ఆడిన తొలిబంతికే షమీ వికెట్ తీశాడు. విల్ యంగ్ ను బౌల్డ్ చేశాడు. 9 ఓవర్లకు
గాను న్యూజీలాండ్ 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. 17 ఓవర్లకు డారిల్ 22 పరుగులు చశారు. కులదీప్
వేసిన ఈ ఓవర్ లో ఏడు పరుగులు వచ్చాయి.
దీంతో న్యూజీలాండ్ స్కోర్ 72/2గా ఉంది. 23వ ఓవర్ లో రచిన్రవీంద్ర అర్ధశతకం చేయగా,
27 వ ఓవర్ లో డారిల్ మిచెల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
27 ఓవర్లలకు కివీస్,
2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.
31
ఓవర్లకు రచిన్ రవీంద్ర, మిచెల్ చెరో 68 పరుగులు చేశారు. షమి వేసిన 34 ఓవర్ లో
రచిన్ రవీంద్ర(75) ఔట్ అయ్యాడు. మూడో బంతికి శుభ్మన్ గిల్ కు క్యాచ్ ఇచ్చాడు.
దీంతో 159 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 34ఓవర్లకు న్యూజీలాండ్ మూడు వికెట్ల
నష్టానికి 180 పరుగులు చేసింది.
కుల్దీప్
యాదవ్ వేసిన 34వ ఓవర్ ఐదో బంతికి టామ్ లేదమ్ (5), ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
దీంతో 205
పరుగుల వద్ద న్యూజీలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన 40 ఓవర్ లో
డారిల్ మిచెల్ సెంచరీ చేశాడు. 41 ఓవర్
ముగిసే సమయానికి గ్లెన్ ఫిలిప్స్ 11 పరుగులు చేయగా, మిచెల్ శతకం తో ఫామ్ లో
ఉన్నాడు. కుల్దీప్ వేసిన 44.2 ఓవర్ కు
గ్లెన్ ఫిలిప్స్(23) ఔట్ అయ్యాడు. 47 ఓవర్లకు కివిస్ బ్యాటర్లు 6 వికెట్ల
నష్టానికి 257 పరుగులు చేశారు. బూమ్రా వేసిన చివరి బంతికి చాప్మన్(6) ఔట్
అయ్యాడు.
ఆ తర్వాత షమీ వరుసగా రెండు వికెట్లు తీశాడు. 49 ఓవర్ కు 8 వికెట్ల
నష్టానికి 263 పరుగులు చేసింది. నిర్ణీత 50 ఓవర్లకు 10 వికెట్ల నష్టానికి
273పరుగులు చేశారు. షమీ 5 వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు. కులదీప్ యాదవ్ రెండ వికెట్లు పడగొట్టగా, బుమ్రా,
సిరాజ్ చెరో వికెట్ తీశారు.
ఇక, వరల్డ్ కప్ కోసం భారత్ ప్రతి మ్యాచ్ లోనూ శార్దూల్ ఠాకూర్ ను ఆడిస్తుండడం
విమర్శల పాలవడం తెలిసిందే. ఎట్టకేలకు ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ ను జట్టు నుంచి
తప్పించారు. అతడి స్థానంలో మహ్మద్ షమీని తుదిజట్టులోకి తీసుకున్నారు. గత మ్యాచ్ లో
గాయపడిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు చోటు
కల్పించారు.