నకిలీ
జనన ధ్రువపత్రం(fake
birth certificate)
కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్(azam khan)తో పాటు ఆయన కుమారుడు అబ్దుల్లాలను
వేరు వేరు జైళ్లకు తరలించారు. ఆజం ఖాన్‌ను సీతాపూర్ జిల్లా జైలుకు తరలించగా ఆయన
కుమారుడిని హర్దౌ జిల్లా జైలుకు పంపారు.
ఈ పరిణామంపై స్పందించిన ఆజంఖాన్,‘‘ ఎన్కౌంటర్
చేస్తారేమో… ఏదైనా జరగవచ్చు’’ అంటూ వ్యాఖ్యానించారు. జైలుకు తరలిస్తున్న క్రమంలో
ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రామ్‌పూర్
జైలు నుంచి సీతాపుర్ జైలుకు తీసుకెళ్తున్న సమయంలో వాహనం వెనక సీట్లో కూర్చోవాలని
పోలీసులు చెప్పగా ఆయన నిరాకరించారు. కిటికీ ఉన్న సీట్లోనే కూర్చుంటానని చెప్పినట్లుగా
తెలిసింది.
తప్పుడు
జనన ధ్రువపత్రం కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్, ఆయన కుమారుడు
అబ్దుల్లా ఖాన్ లతో పాటు భార్య తజీన్ ఫాతిమాలను రామ్‌పూర్ కోర్టు దోషిగా తేల్చింది.
ముగ్గురికి ఏడేళ్ళ జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా విధించింది.
ఉదయం 4 గంటల
40 నిమిషాలకు జైలు నుంచి బయటకు తీసుకురాగా రాత్రి 9 గంటల సమయంలో వేరు వేరు జైళ్ళకు తరలించారు.
వివిధ
కేసులకు సంబంధించి ఎస్పీ నేత ఆజం ఖాన్, రెండేళ్లు సీతాపూర్ జైల్లోనే ఉన్నారు.
సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజా గా నకిలీ ధ్రువపత్రం కేసులో ఏడేళ్ల
శిక్ష పడటంతో ఆయనను మళ్ళీ సీతాపుర్ జైలుకు తరలించారు.