రెండు రోజులుగా కడప జిల్లా ప్రొద్దుటూరులో బంగారం దుకాణాల(Gold Jewellery)పై జరుగుతోన్న ఐటీ సోదాలు ఇవాళ ముగిశాయి. నాలుగు దుకాణాల్లో బిల్లులు లేని 300 కేజీల బంగారాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు జప్తు చేశారు. ప్రొద్దుటూరiలోని జుశెట్టి జువెలర్స్ అండ్ డైమండ్స్, గురురాఘవేంద్ర, తల్లం జువెల్లరీ దుకాణాల్లో తనిఖీలు చేశారు. బిల్లులు లేకుండా ఆదాయపన్ను (Income Tax ) చెల్లించని 300 కేజీల బంగారాన్ని గురించి, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన బంగారాన్ని తిరుపతికి తరలించారు. బిల్లులు లేకుండా భారీగా బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లు దిగుమతి చేసుకుంటున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు.
రాయలసీమలో బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు చాలా ప్రసిద్ది చెందింది. దీన్ని రెండో ముంబయిగా పిలుస్తుంటారు. బంగారం బిల్లులు లేకుండా అక్రమంగా దిగుమతి అవుతోందనే పక్కా సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒక్క ప్రొద్దుటూరులోనే 2 వేలకుపైగా బంగారం దుకాణాలున్నాయి. ఐటీ అధికారుల సోదాల విషయం తెలియగానే బంగారం వ్యాపారులు దుకాణాలు మూసివేశారు.