లెబనాన్(Lebanon) వేదికగా పనిచేసే మిలిటెంట్ సంస్థ
హెజ్బుల్లా(Hezbollah) ను ఇజ్రాయెల్(Israel) సైన్యం మరోసారి హెచ్చరించింది.
ఇప్పటికే ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో హెజ్బుల్లా మిలిటెంట్లతో పోరాడుతున్న
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.
దాడుల
స్థాయి పెంచడంతో పాట లెబనాన్ ను హెజ్బుల్లా యుద్ధంలోకి బలవంతంగా నెడుతోందని
ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సరిహద్దుల్లో పరస్పర దాడులు తీవ్రతరం కావడంతో
యద్ధం విస్తృతమవుతుందనే భయాలను పెంచిందన్నారు.
లెబనాన్
ను యుద్ధంలోకి లాగడం ద్వారా హెజ్బుల్లా సాధించేది ఏమీ ఉండకపోగా మరింత నష్టపోతుందని
హెచ్చరించింది. హమాస్(hamas), హెజ్బుల్లా మిలిటెంట్లు కలిసి
ఇజ్రాయెల్ సైన్యంపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో ఇజ్రాయెల్ కూడా తగుస్థాయిలో
స్పందిస్తోంది.
గాజాలోని
ఉగ్రవాదుల కోసం లెబనీయన్ల శ్రేయస్సు , సౌర్యభౌమాధికారాన్ని ప్రమాదంలో నెట్టేందుకు లెబనాన్ సిద్ధంగా ఉందా
అని ఇజ్రాయెల్ ప్రశ్నిస్తోంది. హమాస్ కు వంతపాడటంపై లెబనాన్ అధికారులు తమను తాము
ప్రశ్నించుకోవాలని హితవు పలికారు.