తెలంగాణలో అసెంబ్లీ (Telangana BJP First List ) ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా 52 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది. కరీంనగర్ నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ పోటీ చేయనున్నారు. కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్, గజ్వేల్, హుజూరాబాద్ రెండు స్థానాల నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలవనున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేయడం సంచలనంగా మారింది.
భోద్ నుంచి సోయం బాపూరావు, నిర్మల్ మహేశ్వర్ రెడ్డి,ముథోల్ రామారావు పటేల్, ఆర్మూర్ పైడి రాకేశ్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ సూర్యనారాయణ గుప్తా, బాల్కొండ అన్నపూర్ణమ్మ, జగిత్యాల బోగ శ్రావణి, గోషామహల్ నుంచి రాజాసింగ్ పోటీ చేయనున్నారు. రాజాసింగ్‌పై పార్టీ విధించిన నిషేధం ఎత్తివేశారు.
దుబ్బాక రఘునందనరావు,మహబూబాబాద్ హుస్సేన్ నాయక్, వర్ధన్నపేట కొండేటి శ్రీధర్, భూపాలపల్లి చందుపట్ల కీర్తిరెడ్డి, ఇల్లందు రవీంద్రనాయక్, భద్రాచలం కుంజా ధర్మారావు, సిరిసిల్ల రాణిరుద్రమ, మానకొండూరు ఆరెపల్లి మోహన్, పటాన్చెరు నందీశ్వర్ గౌడ్ బరిలో నిలవనున్నారు. కుత్భుల్లాపూర్ కూన శ్రీశైలంగౌడ్, ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి, కార్వాన్ అమర్ సింగ్, భువనగిరి గూడూరు నారాయణరెడ్డి, వరంగల్ ఈస్ట్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు పేర్లు ఖరారు చేశారు.