క్రికెట్
ప్రపంచకప్ టోర్నీ(CWC-2023)లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్,
న్యూజీలాండ్(Bharat vs NewZealand) జట్ల మధ్య ఉత్కంఠపోరు జరగనుంది.
ఆప్ఘన్, పాకిస్తాన్, ఆసీస్, బంగ్లాదేశ్ ను ఓడించి విజయయాత్ర కొనసాగిస్తూ సెమీఫైనల్
దిశగా దూసుకెళ్తున్నభారత జట్టు, తన లాగే ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ నెగ్గిన
న్యూజీలాండ్ తో తలపడుతుంది.
హిమచల్‌ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా ఇరు జట్లు
అమీతుమీకి సిద్ధమయ్యాయి.
ఈ
రసవత్తర పోరుకు గాయాల కారణంగా హార్దిక్ పాండ్యా దూరమయ్యారు. అతని స్థానంలో
జట్టులోకి ఎవరోస్తారనేది కీలకంగా మారింది.
షమీ, సూర్యకుమార్, ఇషాన్ కిషన్ లలో ఒకరికి అవకాశం దక్కుతుందని క్రికెట్ నిపుణులు
విశ్లేషిస్తున్నారు.
పిచ్ పై పచ్చిక ఉండటంతో స్వింగ్, బౌన్స్ కు అనుకూలం, పేసర్లకు ఇది సానుకూలాంశంగా ఉంది. బ్యాటర్లు పరుగులు రాబట్టే
ఛాన్స్ లేకపోలేదు. చల్లటి వాతావరణ ఉండటంతో వర్ష భయం మ్యాచ్ ను వెంటాడుతోంది.
2019
ప్రపంచకప్ సెమీస్ పోరులో భారత్‌ను కివీస్ ఓడించింది. నాటి ఓటమికి ఆదివారం
ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
వేలిగాయంతో
బాధపడుతున్న కెప్టెన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదు. లేథమ్
జట్టును నడిపించనున్నారు.
వన్డే ప్రపంచ కప్ లో భాగంగా భారత్, న్యూజీలాండ్ మధ్య
8 మ్యాచ్ లు జరగగా, ఐదింట్లో కివీస్ గెలిచింది. భారత్ మూడింట్లో నెగ్గింది. ప్రస్తుతం
పాయింట్ల పట్టిక లో న్యూజీలాండ్ మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది.
రెండుజట్ల మధ్య రన్ రేట్ తేడా చాల స్వల్పంగా ఉంది.