మధ్య
బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం
కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా
మారనుంది. అనంతరం ఉతర్త ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీరాల
వైపు వెళ్లనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరింతగా బలపడే అవకాశముందని భారత వాతావరణ
శాఖ(imd) వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా
ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి
మోస్తరు వర్షాలు(WEATHER
REPORT) కురిసే
అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో
గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.
వాయుగుండం
తుపానుగా బలపడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు, ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి
సూచికగా తమిళనాడులో వర్షాలు(RAINS)
ప్రారంభమయ్యాయి.