గాజాకు అంతర్జాతీయ సాయం మొదలయ్యాక ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది. వెస్ట్‌బ్యాంక్‌లోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవతాసాయంగా పంపిన 20 ట్రక్కులు ఈజిప్టు రఫా సరిహద్దుదాటుకుని గాజాలోకి ప్రవేశించారు. గాజాలో 24 లక్షల మంది ఆహారం కోసం వేచి చేస్తున్నారని, ఈ సాయం సముద్రంలో నీటిబొట్టులాంటిదని కొందరు అభిర్ణించారు.
హమాస్ (Hamas) ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1400 మంది అమాయక పౌరులను చంపిన తరవాత యుద్ధం మరింత ముదిరింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తరవాత తాజాగా భూతల దాడులు మొదలు పెట్టింది. హమాస్ ఉగ్రవాదులను తుదముట్టించే వరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు గాజాపై జరిపిన దాడుల్లో 4300 మంది పాలస్తీనియన్లు మరణించారని తెలుస్తోంది.గాజాల్లోని మొత్తం గృహాల్లో 40 శాతం దెబ్బతిన్నాయి. గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యుత్ సరఫరా నిలిపేయడంతో అక్కడ మానవ సంక్షోభం ఏర్పడే ప్రమాదముందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.
గాజాపై దాడులు పెంచుతామని ఐడీఎఫ్ ప్రతినిధి అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. గాజాలో భూతల దాడుల్లో తమ సైన్యం దెబ్బతినకుండా ఉండేందుకు దాడులు మరింత పెంచుతామని హగారి హెచ్చరించారు. అందుకే గాజా ఉత్తరంవైపు ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని హెచ్చరించినట్లు ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికీ ఇంకా 210 మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నారు. తమ దేశపౌరులను విడిపించుకునేందుకు ఖతార్ చర్చలు మొదలు పెట్టింది. గాజా సరిహద్దు వెంట ఇజ్రాయెల్ 3 లక్షల మంది సైన్యాన్ని మోహరించింది. ఇజ్రాయెల్ భూతల దాడుల్లో చాలా సవాళ్లను అదిగమించాల్సి ఉంది. హమాస్ ఉగ్రవాదులు సొరంగాల్లో నక్కి ఉన్నారని ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపారు. నిన్న సాయంత్రం ఇద్దరు అమెరికన్ పౌరులను హమాస్ ఉగ్రవాదులు విడుదల చేశారు.
ఇరువర్గాలు కాల్పుల విరమణకు రావాలని లేదంటే గాజాలో మానవ సంక్షోభం ఏర్పడే ప్రమాద ముందని ఐరాస (UNO) చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.