తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు( Srivari Navarathri
Brahmotsavalu) నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులను అనుగ్రహించారు. స్వర్ణరథంపై తిరువీధుల్లో విహరించారు.
స్వామిని దర్శించుకునేందుకు పురవీధుల్లోకి
భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీతిరుమలేశుడి వాహనసేవ
కనులవిందుగా జరిగింది.
శనివారం రాత్రి స్వామివారకి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందనామాలతో తిరువీధులు మార్మోగాయి.
రాత్రి 7 గంటల వరకు అశ్వ వాహనంపై ఊరేగనున్నారు. నేటితో శ్రీవారి
వాహన సేవలు ముగుస్తాయి. సోమవారం ఉదయం నిర్వహించనున్న చక్రస్నానంతో నవరాత్రి
బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
శనివారం స్వామివారిని 65,442 మంది
దర్శించుకున్నారు. 33,122 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా
స్వామికి రూ.2.84 కోట్ల కానుకులు వచ్చాయి.