ఇంద్రకీలాద్రిపై
శరన్నవరాత్రి ఉత్సవాలు(Navaratri
special)
శోభాయమానంగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం
నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా రోజుకో అలంకారంలో
అనుగ్రహిస్తున్న జగన్మాత, నేడు అష్టమి సందర్భంగా శ్రీకనకదుర్గమ్మవారు శ్రీదుర్గాదేవిగా
భక్తులకు దర్శనమిస్తున్నారు.
లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి
దుర్గగా అమ్మవారు కొలువుదీరారు.
దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై స్వయంగా అమ్మవారు
ఆవిర్భవించింది. దుర్గే దుర్గతినాశిని అనే వాక్యం భక్తులకు సర్వ శుభాలను
ప్రసాదిస్తుంది. శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని అర్చించడంతో దుర్గతులను
పోగొట్టి సద్గతులు ప్రసాదిస్తుంది
శ్రీగిరిపై
దసరా మహోత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
శనివారం నాడు భ్రమరాంబా అమ్మవారు
కాళరాత్రి గా దర్శనమిచ్చారు. నల్లటి ఛాయాదేహంతో జుట్టు విరబోసుకుని భయంకరంగా ఉండి.
ఆ తల్లి ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించే సకలశుభంకరి అని భక్తుల విశ్వాసం.
ఆది
పరాశక్తుల్లో ఏడో రూపమైన కాళరాత్రి అమ్మవారు గాడిదను వాహనంగా చేసుకుని నాలుగుచేతుల్లో
వర, అభయ, ముద్రలతో ఖడ్గం, లోహకంటక ఆయుధాలుగా ధరించి రౌద్ర రూపంలో సకల శుభప్రదాయినిగా
భక్తులకు దర్శనమిచ్చింది.
ఈ అలంకారంలో అమ్మను దర్శించుకుంటే భూతప్రేత, పిశాచాదులు
భయపడి పారిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని విశ్వాసం.
నేడు
అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనమిస్తారు. మల్లికార్జున స్వామి నందివాహన సేవలో
భక్తులను ఆశీర్వదిస్తారు.