రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడబోయే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే
వర్గీయులకు పెద్దపీట వేశారు. బీజేపీ 83 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. వసుంధర రాజే ఝుల్రాపటన్ నుంచి పోటీ చేయనున్నారు.
కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత గజేంద్ర సింగ్ షెకావత్‌తో వసుంధర రాజేకు విభేదాలున్నాయి.
2018లో గజేంద్ర సింగ్ షెకావత్‌కు రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడాన్ని కూడా వసుంధరా రాజే వ్యతిరేకించారు. దీని వల్ల పార్టీకి జాట్ సామాజికవర్గం దూరమైందని ఆమె ఆరోపిస్తున్నారు. మొదటి జాబితాలో వసుంధరా రాజే వర్గాన్ని దూరం పెట్టడంతో అనేక విమర్శలు వచ్చాయి. రెండో జాబితాలో ఆమె వర్గానికి పెద్ద పీట వేశారు.
శుక్రవారం ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో వసుంధరా వర్గానికి పెద్దపీట వేయడం ద్వారా రాజస్థాన్
ఎన్నికల్లో విజయం సాధించాలని నిర్ణయించారు.
విద్యానగర్ నుంచి బీజేపీ సీనియర్ నేత వసుంధరా వర్గీయుడు నర్పత్ సింగ్ రాజ్వీకి కేటాయించారు. సీనియర్ నాయకుడు భైరోన్ సింగ్ షెకావత్ అల్లుడు నర్పత్ సింగ్ రాజ్వీ పేరు మొదటి జాబితాలో లేకపోవడం పెద్ద దుమారం రేగింది. దీంతో రెండో జాబితాలో వసుంధరా వర్గానికి పెద్దపీట వేశారు.
రాజస్థాన్ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల మొదటి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 33 మందితో మొదటి జాబితాను శనివారం విడుదలైంది.
మొదటి జాబితాలో సీఎం అశోక్ గెహ్లాట్ సర్దార్‌పుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. సచిన్ ఫైలట్ టోంక్ నుంచి బరిలో దిగనున్నారు. రాజస్థాన్
కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోస్తారా లచ్మన్ఘర్ నుంచి పోటీకి దిగనున్నారు.