క్రికెట్
పసికూన నెదర్లాండ్స్ వరల్డ్ కప్‌లో మరోసారి మెరుగైన ఆటతీరు కనబరిచింది. శ్రీలంక
ముందు 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
లఖ్‌నవూలో
జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట్లో డచ్ బ్యాట్స్‌మెన్
పెద్దగా రాణించలేదు. నాలుగో ఓవర్లో 7 పరుగుల స్కోర్ వద్ద మొదటి వికెట్‌గా విక్రంజీత్
సింగ్ ఔటయ్యాడు. 48 పరుగుల వద్ద రెండో
వికెట్, 54 పరుగుల వద్ద మూడో వికెట్, 68 పరుగుల వద్ద నాలుగో వికెట్, 71 పరుగుల
వద్ద ఐదో వికెట్, 91 పరుగుల వద్ద ఆరో వికెట్ పడ్డాయి.
ఆ తర్వాత
నుంచీ కథ మారిపోయింది. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెక్ట్, వాన్ బీక్ ద్వయం నిలకడగా ఆడి
నెదర్లాండ్స్‌కు గౌరవప్రదమైన స్కోర్ చేసిపెట్టారు. శ్రీలంక బౌలర్ల సహనానికి పరీక్ష
పెట్టి, వారిని గతి తప్పేలా చేసారు. ఎంగెల్‌బ్రెక్ట్ 70 పరుగులు, వాన్ బీక్ 59
పరుగులు చేసారు. ఏడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 130 పరుగులు చేసారు. జట్టు స్కోరు
221 పరుగుల వద్ద ఉండగా ఎంగెల్‌బ్రెక్ట్ ఔటయ్యాడు.
ఎంగెల్‌బ్రెక్ట్,
వాన్ బీక్ జోడీ విచ్ఛిన్నమయ్యాక నెదర్లాండ్స్ పెద్దగా ఆడలేకపోయింది. వాన్ బీక్ను
తప్పించి తర్వాత వచ్చిన ఆటగాళ్ళు ఎవరూ పది రన్స్ అయినా చేయలేకపోయారు. నిజానికి
శ్రీలంక జట్టు ఇచ్చిన 33 ఎక్స్ట్రా రన్సే నెదర్లాండ్స్ బోర్డ్‌లో మూడో పెద్ద స్కోర్.
లంక బౌలింగ్ ఎంత అదుపు తప్పిందో దీన్నిబట్టే తెలుస్తోంది.