ఏపీ హైకోర్టు అదనపు ప్రధాన న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అదనపు న్యాయమూర్తులతో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. అదనపు న్యాయమూర్తులుగా హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, కొత్తగా ప్రమాణం చేసిన అదనపు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇద్దరిని ఇటీవల బదిలీ చేశారు. కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు రానున్నారు. కొత్తగా నలుగురు న్యాయమూర్తుల నియామకంతో ఏపీ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కు చేరింది.