తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు శనివారం ఉదయం స్వామి వారు సూర్యప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది శ్రీవారి భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ జరగనుంది.
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. దాదాపు 4 వేల మంది పోలీసులు రక్షణ విధుల్లో పాల్గొన్నారు. టీటీడీకి చెందిన 1000 మంది విజిలెన్స్ సిబ్బంది కూడా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రోజుకు లక్ష నుంచి లక్షా 20 వేల మంది భక్తులు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.