ప్రపంచకప్ వన్డేలో ఆస్ట్రేలియా దూకుడు కొనసాగిస్తోంది. శుక్రవారం పాక్పై బెంగళూరు వేదికగా జరిగిన వన్డేలో పరుగుల వరద పారించింది. పాక్పై 62 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్నీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో డేవిడ్ వార్నర్ 124 బంతుల్లో 163 పరుగులు, మిచెల్ మార్ష్ 108 బంతుల్లో 121 పరుగులు చేశారు. షహీన్ షా అఫ్రిది 5, హారిస్ రవూఫ్ 3 వికెట్లు తీశారు.
లక్ష్య ఛేదనలో పాక్ బోల్తాపడింది. 368 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన పాక్ జట్టు 305 పరుగులకే ఆలౌటైంది. పాక్ జట్టులో ఇమాముల్ హక్ 71 బంతుల్లో 70 పరుగులు, అబ్దుల్లా షఫీక్ 61 బంతుల్లో 64, మహమ్మద్ రిజ్వాన్ 46 పరుగులు చేశారు. జంపా 4, స్టాయినిస్ 2 వికెట్లు తీసి పాక్ జట్టును కట్టడి చేశారు. దీంతో 62 పరుగుల తేడాతో కంగారూ జట్టు విజయం సొంతం చేసుకుంది.