పాకిస్తాన్
తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్,
మిచెల్ మార్ష్ అద్భుతంగా ఆడారు. ఇద్దరూ
సెంచరీలు చేసి స్కోరు బోర్డును పరిగెత్తించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ ఓపెనర్లు చెలరేగారు. ఫోర్లు,
సిక్సర్లతో పాక్ బౌలర్లను చెండాడారు.
39
బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న వార్నర్ అదే దూకుడు కొనసాగిస్తూ
పాకిస్తాన్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు.
31వ ఓవర్ లో ఇద్దరూ శతకాలు సాధించారు. పాకిస్తాన్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్
బౌలింగ్ లో నాలుగో బంతికి వార్నర్ 100 పరుగులు చేయగా, మరుసటి బంతికి మిచెల్ మార్ష్
సెంచరీ పూర్తి చేశాడు.
వెటరన్
ఓపెనర్ వార్నర్ కు ఇది పాకిస్తాన్ పై వరుసగా నాలుగో సెంచరీ కాగా, మిచెల్ మార్ష్ ,
నేడు తన పుట్టిన రోజును సెంచరీతో సెలబ్రేట్ చేసుకున్నాడు. 31.3 ఓవర్లకు డేవిడ్
వార్నర్ 101 పరుగులు చేయగా, మిచెల్ మార్ష్ 108 రన్స్ చేశారు. దీంతో వికెట్
నష్టపోకుండానే ఆస్ట్రేలియా 221 పరుగులు చేసింది.
40 ఓవర్లకు ఆస్ట్రేలియా జట్టు
మూడు వికెట్లు నష్టపోయి 297 పరుగులు చేసింది.
43
ఓవర్ రెండో బంతికి 163 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. అప్పటికే ఆస్ట్రేలియా 325 పరుగులు చేసింది.
తర్వాతి నుంచి ఆస్ట్రేలియా బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు.
దీంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది.
7 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 42 పరుగులు
మాత్రమే సాధించారు. ఆసీస్ జట్టు నిర్ణీత
50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. పాక్ బౌలర్ షహీన్ అఫ్రిదీ 5
వికెట్లు పడగొట్టాడు. 400 మార్క్ దాటే
అవకాశాన్ని జారవిడుచుకున్నారు. అయినప్పటికీ పాకిస్తాన్కు ఇది భారీ లక్ష్యమే.