దసరా
మహోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీకనకదుర్గమ్మను ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు
వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు.
ఇంద్రకీలాద్రికి
చేరుకున్న సీఎం జగన్ కు ఆలయ వేద పండితులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం
పలికారు. ఆలయ చిన రాజగోపురం వద్ద ముఖ్యమంత్రికి అర్చకులు పరివేష్టం చుట్టారు.
అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. సీఎం జగన్కు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు
సత్యనారాయణ, అమ్మవారి ప్రసాదంతో పాటు చిత్రపటం అందజేశారు.
ముఖ్యమంత్రి వెంట
పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
నేడు
అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం
కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. సీఎం వైఎస్
జగన్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్
క్రాంతి రాణా టాటాభద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.