ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య తరవాత భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్త ముందని నిప్పు రాజేసిన కెనడా ప్రధాని ట్రూడో, తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో బెంగళూరు,ముంబై, చండీగఢ్ నగరాల శివారుల్లో కెనడా వాసులు జాగ్రత్తగా ఉండాలంటూ ట్రూడో హెచ్చరికలు చేశారు. భారత్ నుంచి 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకున్న కాసేపటికే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం
గమనార్హం.
దేశ వ్యాప్తంగా తీవ్రవాద దాడుల ముప్పు నేపథ్యంలో భారత్‌లో కెనడా పౌరులు చాలా జాగ్రత్తగా ఉండాలని ట్రూడో సూచించారు.కెనడా పట్ల భారత్‌లో ప్రతికూల
అభిప్రాయాలు ఉన్నాయని ఇది కెనడా వ్యతిరేక నిరసనలు, ప్రదర్శనలకు దారితీవచ్చని సూచించారు. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వొద్దని తాజాగా హెచ్చరించారు.
కెనడాకు చెందిన 41 మంది దౌత్యవేత్తలు, వారి కుటుంబాలకు దౌత్యపరమైన రక్షణ తీసేస్తామని భారత్ హెచ్చరించడంతో వారిని ఉపసంహరించుకుంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, చండీగఢ్‌లో కెనడా కాన్సులేట్ సేవలు నిలిపి వేసింది. ఎవరికైనా అత్యవసర సాయం కావాలంటే ఢిల్లీలోని కెనడా హైకమిషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
జేబులు కొట్టేయడం, పర్సులు కాజేయడంతోపాటు, విదేశీయులను లక్ష్యంగా చేసుకునే ప్రమాద ఉందని కెనడా పౌరులను ఆదేశం హెచ్చరించింది. ప్రధాన నగరాలు, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని, పెద్ద మొత్తంలో డబ్బు దగ్గర ఉంచుకోవద్దని కెనడా హెచ్చరించింది.