ఈశాన్య రుతుపవనాలు వస్తూనే అల్పపీడనం
ఏర్పడేందుకు అనువైన పరిస్థితులను కల్పిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో భారతదేశాన్ని తాకనున్నాయి. నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రేపటికి
ఇది అల్పపీడనంగా మారనుందని అమరావతి వాతావరణ విభాగం వెల్లడించింది.
ఇది వాయవ్య దిశగా పయనించి అక్టోబరు 23 నాటికి పశ్చిమ మధ్య
బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని అంచనా వేస్తోంది. దీని ప్రభావం
ఉత్తరాంధ్రపై ఉంటుందని భావిస్తున్నారు.
ఉత్తర కోస్తా ప్రాంతంలో రానున్న మూడు
రోజుల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి
వర్షాలు కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా, రాయలసీమ వ్యాప్తంగా ఇదే వాతావరణ
పరిస్థితి కొనసాగనుంది.
ప్రస్తుతం ఆరేబియా మహా సముద్రంలో అల్పపీడనం
ఏర్పడిందని, బంగాళాఖాతంలోనూ రేపు మరో అల్పపీడనం ఏర్పడుతుందని, ఈ రెండింటి కారణంగా
ప్రారంభ దశలో ఈశాన్య రుతుపవనాల తీవ్రత దక్షిణ భారతదేశంలో తగ్గుతుందని చెన్నై
వాతావరణ పరిశోధన కేంద్రం చైర్మన్ బాలచంద్రన్ తెలిపారు.
జాలర్లు ఈనెల 23 వరకు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని
హెచ్చరించారు. రానున్న 24 గంటల్లో దక్షిణ, ఉత్తర తమిళనాడులోని కొన్ని చోట్ల తేలికపాటి
వర్షం పడుతుందన్నారు. చెన్నై, శివారు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని
వెల్లడించారు.