ఫైబర్‌నెట్
కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ముందస్తు
బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. నవంబర్ 9న ఈ వ్యాజ్యంలో వాదనలు విననుంది.
నేడు విచారణ జరిపిన జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం, నవంబర్
8కి వాయిదా వేసింది. అనంతరం చంద్రబాబు న్యాయవాదుల వినతి మేరకు 9వ తేదీకి విచారణ
వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
స్కిల్
డెవలప్మెంట్ కేసుపై ముందుగా తీర్పు ఇస్తామని, ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు అంశాన్ని
పరిగణనలోకి తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అప్పటి వరకు
చంద్రబాబును అరెస్టు చేయవద్దని, పీటీ వారెంట్ పై యథాతథ స్థితి కొనసాగించాలని
ఆదేశించింది.
ఫైబర్‌నెట్
కేసులో తన ముందుస్తు బెయిల్‌ను ఈ నెల 9న హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు
సుప్రీంను ఆశ్రయించారు.
స్కిల్ కేసులో భాగంగా రాజమహేంద్రవరం కేంద్ర
కారాగారంలో జుడీషియల్ రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లీగల్ ములాఖత్‌లు
పెంచాలని వేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. వివిధ కోర్టుల్లో
విచారణ ఉన్నందున రోజుకు మూడు ములాఖత్‌లు ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు పిటిషన్
వేశారు. ప్రతివాదుల పేర్లు చేర్చనందున ఇప్పుడు విచారణ అవసరం లేదన్న న్యాయమూర్తి,
రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్ ఉంటుందన్నారు.