హ్యాట్రిక్
విజయాల మంచి జోరుతో పుణెలో అడుగుపెట్టిన భారత జట్టు, బంగ్లాదేశ్తో జరిగిన
పోరులోనూ విజయయాత్రను కొనసాగించింది. 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ను చిత్తుగా
ఓడించి అద్భుత విజయాన్ని అందుకుంది. వరల్డ్కప్ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన అన్ని
మ్యాచుల్లోనూ భారత్ నెగ్గింది.
టాస్
గెలిచి బ్యాటింగ్కు దిగిన బంగ్లా జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి
256 పరుగులు చేసింది. తన్జీద్ హసన్(51), లిటన్ దాస్(66) అర్ధశతకాలు సాధించారు.
మహ్మదుల్లా (46) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. షకీబ్ బదులు జట్టుకు నాయకత్వం వహించిన
నజ్ముల్ హసన్(8), మెహదీ హసన్ మిరాజ్(3), తౌహిద్(16), నసుమ్(14) విఫలమయ్యారు.
భారత
బౌలర్లలో జడేజా, బుమ్రా, సిరాజ్ తలా 2 వికెట్లు పడగొట్టారు.
లక్ష్య
ఛేదనలో భారత్ 41.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 261 పరుగులు చేసి నాలుగో
విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
విరాట్
కోహ్లీ 97 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్ గా నిలవగా, శుభమన్ గిల్ 53 పరుగులు
చేశారు.
రోహిత్ శర్మ(48), కేఎల్ రాహుల్(34) నాటౌట్ గా రాణించారు. బంగ్లా బౌలర్లలో
మోహదీ 2 వికెట్లు పడగొట్టాడు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కంది.
వరల్డ్
కప్ టోర్నీలో భాగంగా ఆదివారం నాడు న్యూజీలాండ్ తో భారత్ తలపడనుంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్