టాస్
గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ చెప్పుకోదగిన స్థాయిలో స్కోర్ చేసింది.
భారత్ ముందు 259 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మొదటి ఓవర్ లో ఒక పరుగు మాత్రమే
చేయగల్గింది. రెండో ఒవర్లో తన్జిద్ బౌండరీ బాదాడు. దీంతో బంగ్లా స్కోరు ఐదుకు
చేరింది. ఐదు ఓవర్లు ముగిసే సరికి బంగ్లా స్కోరు పది పరుగులు మాత్రమే చేసింది . పదో
ఓవర్ ముగిసే సరికి 63 పరుగులు చేసి రన్
రేట్ పెంచారు.
14వ ఓవర్ లో బంగ్లా ఓపెనర్ తన్జిద్ హాఫ్ సెంచరీ చేశాడు. అతడి వన్డే
కెరీర్ లో ఇదే తొలి అర్ధ శతకం. శార్దూల్ వేసిన ఈ ఓవర్ లో 12 పరుగులు రాబట్టారు.
14.4 బంతికి తన్జిద్ ఔటయ్యాడు. దీంతో క్రీజ్ లోకి కెప్టెన్ షాంటో వచ్చాడు. జడేజా
వేసిన 20వ ఓవర్ లో చివరి బంతికి నజ్ముల్ శాంటో(8) ఔట్ అయ్యాడు. సిరాజ్ వేసిన 25వ
ఓవర్ లో తొలి బంతికి మోహదీ హసన్ మిరాజ్(3) కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో
129పరుగుల వద్ద బంగ్లాదేశ్ మూడో వికెట్ కోల్పోయింది.
27
వ ఓవర్ లో జడేజా మరో వికెట్ పడగొట్టాడు. 27.4 ఓవర్ వద్ద టిట్టన్ దాస్(66) గిల్ కు క్యాచ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ ఐదో వికెట్
పడగొట్టడానికి భారత బౌలర్లు చాలా సేపు శ్రమించారు. శార్దూల్ ఠాకూర్ వేసిన 37.2
ఓవర్ కు శుభమన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. 40 ఓవర్లకు బంగ్లాదేశ్ ఐదు వికెట్ల
నష్టానికి 189 పరుగులు చేసింది.
బుమ్రా వేసిన 42.3 ఓవర్‌కు ముష్ఫీకర్ రహీమ్(38) పెవిలియన్
చేరాడు.
46 ఓవర్లకు 225 పరుగులు చేసింది.
సిరాజ్ వేసిన 47 ఓవర్ లో రెండు ఫోర్లు బాదిన నసుమ్ అహ్మద్ (14) ఔటయ్యాడు. 48
ఓవర్లకు 238 పరుగుల చేశారు. సిరాజ్ వేసిన 49వ ఓవర్ లో 10 పరుగులు రాబట్టారు. మూడో
బంతిని మహ్మదుల్లా (46) లాంగాన్ మీదుగా స్టాండ్స్ లోకి పంపాడు. నిర్ణీత 50 ఓవర్లలో
8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.