స్కిల్
కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు
వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసింది.
చంద్రబాబు
ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన
న్యాయస్థానం, వచ్చే వాయిదా నాటికి మెడికల్ రిపోర్టులను కోర్టు ముందు ఉంచాలని
ప్రభుత్వం తరఫు న్యాయవాదులను ఆదేశించారు.
చంద్రబాబు తరఫు న్యాయవాదుల వినతి మేరకు
పిటిషన్ వెకేషన్ బెంచ్ కు బదిలీ చేశారు.
చంద్రబాబు
ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ లూద్రా
వాదించారు. ఈ కేసులో ఇతర నిందితుడులు బెయిల్ పై ఉన్నారనిపై ఉన్నారని న్యాయస్థానం దృష్టికి
తీసుకెళ్ళారు. గడిచిన 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, చంద్రబాబు
ఆరోగ్యం దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే తమకు కొంత సమయం కావాలని
ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు.
మధ్యాహ్నం తర్వాత వాదనలు విన్న ధర్మాసనం విచారణను
వెకేషన్ బెంచ్ కు బదిలీ చేసింది.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టులో ఐఏ పిటిషన్
దాఖలైంది. ఐఏ పిటిషన్ పైనా విచారణను వెకేషన్ బెంచ్ చేపడుతుందని జడ్జి తెలిపారు.
వెంటనే చంద్రబాబు ఆరోగ్యంపై నివేదికను వెకేషన్ బెంచ్‌కు అందజేయాలని న్యాయస్థానం
ఉత్తర్వులు జారీ చేసింది.