తప్పుడు
వార్తలను నిరోధించే క్రమంలో యూట్యూబ్ కొత్త మార్గదర్శకాలకు సిద్ధమైంది. ఇక నుంచి
వాచ్ పేజీలో విశ్వసనీయ వర్గాల నుంచి అందే వార్తలను మాత్రమే ఉంచనున్నారు. ఈ నిర్ణయాన్ని రానున్న కొన్ని
నెలల్లో అధికారికంగా అమలు చేయనున్నారు.
‘‘ విశ్వసనీయ వనరుల నుంచి అందుబాటులో ఉన్న
వీడియోలను వాచ్ పేజీ సిఫార్సు చేస్తుంది” అని యూట్యూబ్ ఇండియా, ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ
హెడ్, మీరా చాట్ తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్లో ఆమె ఈ విషయాన్ని
వెల్లడించారు. భారత్లో రాబోయే నెలల్లో వాచ్ పేజీని విడుదల చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
మార్గదర్శకాలను పాటించని 2 మిలియన్ వీడియోలను ఇప్పటికే తొలిగించినట్లు ఆమె
తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో ఈ వీడియోలను తొలగించినట్లు
పేర్కొన్నారు.
ఫేక్
న్యూస్ అరికట్టడంపై యూట్యూబ్ కు ఇటీవల కేంద్రప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
దీనిపై స్పందించిన యాజమాన్యం కట్టడి చర్యలకు సిద్ధమైంది.
ఫేక్
న్యూస్ పై కేంద్రప్రభుత్వం నుంచి సరైన నిర్వచనం లేదని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా పేర్కొంది.