స్కిల్
కేసులో అరెస్టు అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు
నవంబర్ 1 వరకు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో ఆయనను
వర్చువల్ విధానంలో కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులను
న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు.
ఈ
సందర్భంగా తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టుకు తెలిపారు. దీనిపై
స్పందించిన న్యాయమూర్తి, తనకు లిఖిత పూర్వకంగా వివరాలు అందజేయాలని కోరారు.
చంద్రబాబు రాసే లేఖను తనకు అందజేయాలని జైలు అధికారులను ఆదేశించారు. మెడికల్
రిపోర్టులను ఎప్పటికప్పుడు కోర్టుకు అందజేయాలని జైలు అధికారులకు చెప్పారు.
ఏసీబీ
కోర్టులో చంద్రబాబు లాయర్లు మరో పిటిషన్ దాఖలు చేశారు. జైల్లో ములాఖత్‌లు
పెంచాలన్నారు. రోజుకు మూడుసార్లు ములాఖత్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును
కోరారు.
మరోవైపు
స్కిల్ కేసులో చంద్రబాబు హైకోర్టు లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది.
ఫైబర్ గ్రిడ్ కేసులో సుప్రీంకోర్టు లో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్, రేపు
ధర్మాసనం ముందుకు రానుంది.