న్యూస్‌క్లిక్ సంస్థకు చైనాతో సంబంధాలున్న పలు కంపెనీల నుంచి భారీగా అక్రమ మార్గంలో నిధులు వచ్చాయని ఆ సంస్థ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ ఛీప్ ప్రబీర్ పురకాయస్త, ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమత్ చక్రవర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిపై పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద కేసు నమోదు చేశారు. దీన్ని న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్త, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు పోలీసులను కోరింది.
పురకాయస్త, చక్రవర్తి తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మానం ఆదేశించింది. అక్టోబరు 30లోగా వివరణ ఇవ్వాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈనెల 16న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద కపిల్ సిబల్ ప్రస్తావించడంతో అత్యవసరంగా ఈ కేసును లిస్ట్ చేశారు.
అరెస్ట్, రిమాండుపై నిందితుల పిటిషన్‌ను అక్టోబరు 13న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. చైనా అనుకూల ప్రచారం కోసం అక్రమమార్గాల్లో డబ్బు అందుకున్నారని న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్త, ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.