తమిళనాడు
మంత్రి సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు డిస్మిస్
చేసింది. మనీ లాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్, ఈ
ఏడాది జూన్ లో అరెస్టు చేసింది.
బెయిల్
కోరుతూ ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ జయచంద్రన్ విచారించారు.
మనీలాండరింగ్
కేసులో నిందితుడిగా ఉన్న సెంథిల్, మంత్రి హోదాలో ఉండటంతో పాటు బెయిల్ ఇస్తే
సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని, అలాగే ఈ కేసులో సహనిందితుడైన మంత్రి సోదరుడు పరారీలో ఉండటంతో బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు కోర్టు
ప్రకటించింది.
సర్జీరీ
అనంతరం తీసుకోవాల్సిన చికిత్స, పుఝల్ సెంట్రల్ జైలులోని ఆస్పత్రిలో సౌకర్యాల లేమి
కారణంగా మెడికల్ గ్రౌండ్ లో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన
హైకోర్టు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. పీఎంఎల్ఏ కోర్టు ఇప్పటికే రెండు సార్లు
బెయిల్ పిటిషన్ ను నిరాకరించింది.
గత ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సెంథిల్
బాలాజీ ‘నోటుకు ఉద్యోగం’ పేరిట అవినీతికి పాల్పడ్డారని అలాగే మనీలాండరింగ్ చేశారనే
ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసింది. ఈ ఏడాది జూన్ 14న ఆయనను ఈడీ అరెస్టు చేసి ఈ కేసును
విచారిస్తోంది. అరెస్టు కావడానికి ముందు
సెంథిల్ బాలాజీ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.