టాలీవుడ్
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. అద్భుతమైన నటనతో గ్లోబల్‌స్టార్
గా పేరుతెచ్చుకున్న ఎన్టీఆర్ కు తాజాగా మరో ఘనత దక్కింది. ఆయన ఆస్కార్ యాక్టర్స్
బ్రాంచ్ లో సభ్యత్వం సాధించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్, కొత్త
సభ్యులను ఎంపిక చేసింది.
ఈ
ఏడాది ఆస్కార్ కమిటీ 398మందికి కొత్తగా ఆస్కార్ ప్యానెల్ లో చోటు
కల్పించబోతున్నట్లు ముందుగానే ప్రకటించింది. భారత్ నుంచి పదకొండు సినీ ప్రముఖులకు
ఆహ్వానాలు అందాయి. టాలీవుడ నుంచి రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్,
సెంథిల్, సాబు సిరిల్ కు చోటు లభించింది.
భారత్
నుంచి ఎన్టీఆర్‌ను కమిటీ సభ్యుడిగా ఆస్కార్ అధికారికంగా ప్రకటించింది. ప్యానల్ లో
చోటు దక్కించుకున్న వారందరికీ రాబోయే ఆస్కార్ అవార్డుల ఎంపికలో ఓటు హక్కు ఉంటుంది.
ప్రముఖ
దర్శకులు మణిరత్నం, కరణ్ జోహార్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, చైతన్య తమహానే, షానెక్సేన్లు
కూడా ఆస్కార్ కమిటీ నుంచి ఆహ్వానాల్ని అందుకున్నారు.