వన్డే
ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు, నేడు మరో
సమరానికి దిగుతోంది. మధ్యాహ్నం పుణేలో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆస్ట్రేలియా, ఆప్ఘన్,
పాకిస్తాన్ లను ఓడించిన భారత్ జట్టు, నేడు అదే జోరు కొనసాగించి నాలుగో విజయాన్ని
నమోదు చేసేందుకు తహతహలాడుతోంది.
బంగ్లాదేశ్ జట్టు కూడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
వికెట్
స్పిన్ కు అనుకూలించే అవకాశముండటంతో అదనపు స్పిన్నర్‌ను ఆడించాలని భారత జట్టు మేనేజ్మెంట్
నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో స్పిన్నర్
రవిచంద్రన్ అశ్విన్‌ను తుదిజట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం.
బుమ్రాకు విశ్రాంతి
ఇచ్చి షమీని ఆడించే అవకాశముందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్
కెప్టన్ షకీబ్ ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అతను తొడ కండరాల గాయంతో
బాధపడుతున్నారు. అతడి స్థానంలో లిటిన్ దాస్
బంగ్లా జట్టును నడిపించే అవకాశముంది.
పుణె
పిచ్ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశలెక్కువ.
ఇక్కడ జరిగిన ఐదు మ్యాచుల్లో మూడింట తొలుత
బ్యాటింగ్ చేసిన జట్లు మూడొందల పైచిలుకు స్కోర్లు చేశాయి. ప్రస్తుతం వాతావరణం
పొడిగా ఉండగా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశముంది.
గత
రెండు ప్రపంచకప్ టోర్నీల్లోనూ బంగ్లాదేశ్‌తో ఆడిన మ్యాచుల్లో రోహిత్ సెంచరీలు
చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్ పై బంగ్లాదేశ్ ఒకే సారి (2007)లో విజయం సాధించింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్