తిరుమలలో
వేంచేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా
కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామి వారు దర్శనమిచ్చారు.
తిరుమాడ వీధుల్లో విహరించి భక్తులను తన్మయత్వంలో ముంచెత్తారు.
గోవింద నామస్మరణతో
తిరుమల మార్మోగుతోంది. సాయంత్రం వైభవంగా గరుడోత్సవం నిర్వహించనున్నారు.
బుధవారం
రాత్రి మలయప్ప స్వామి, గజేంద్ర మోక్ష అలంకరణలో తిరుమాడ వీధుల్లో సర్వభూపాల వాహనంపై
విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.
గరుడోత్సవంలో
స్వామివారికి ప్రత్యేక అలంకరణగా లక్ష్మీకాసులహారం, సహస్రనామ కాసులహారం
అలంకరిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా గర్భాలయం దాటి స్వామి ఆభరణాలు బయటకు రానున్నాయి.
గరుడోత్సవం
సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
4వేల మంది పోలీసులు, 1000 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో గరుడోత్సవ బందోబస్తు
నిర్వహిస్తున్నారు.
గ్యాలరీ నుంచి రెండు లక్షల మంది వాహన సేవలు వీక్షించే విధంగా
ఏర్పాట్లు చేశారు. 14 రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు గరుడోత్సవంలో ప్రదర్శనలు
ఇవ్వనున్నాయి.