స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 457 పాయింట్ల నష్టంతో, 65419 వద్ద మొదలైంది. 128 పాయింట్ల నష్టంతో నిఫ్టీ, 19542 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.25గా ఉంది.
సెన్సెక్స్ 30లో ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటాస్టీల్, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, టైటాన్, టెక్ మహీంద్రా, ఎస్బిఐ, ఎం అండ్ ఎం షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
అమెరికా, ఐరోపా మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. అమెరికాలో బాండ్ల రాబడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బంగారం ధరలు పెరగడంతో స్టాక్స్‌లో పెట్టుబడులు బులియన్ మార్కెట్లకు తరలుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.