ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఔరా అనిపించుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు, న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి కివీస్ బ్యాటింగ్‌కు దిగింది. 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. 289 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 139 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్ఘన్ చెత్త ఫీల్డింగ్ ఆ జట్టు ఓటమికి కారణమైంది. ఐదు క్యాచ్‌లు వదిలేయడంతో న్యూజిలాండ్ స్కోర్ భారీగా చేసింది.
న్యూజిలాండ్ జట్టులో గ్లెన్ ఫిలిప్స్ 80 బంతుల్లో 71 పరుగులు, లేథమ్ 74 బంతుల్లో 68 చేసి జట్టు స్కోరు పరుగులు తీయించారు. ఓపెనర్ విల్ యంగ్ 64 బంతుల్లో 54 పరుగులతో రాణించాడు. లక్ష్య ఛేదనలో ఆప్ఘన్ చేతులెత్తేసింది. ఫెర్గూసన్ 3, శాంట్నర్ 3, బౌల్ట్ 2 వికెట్లు తీశారు. ఆఫ్ఘన్ జట్టు 139 పరుగులకే అలౌటైంది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్