దేశవ్యాప్తంగా
16 మంది హైకోర్టు జడ్జీలు బదిలీ అయ్యారు.
సుప్రీంకోర్టు కొలీజయం సిఫార్సు మేరకు పదహారు మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను
కేంద్రప్రభుత్వం బుధవారం నోటిఫై చేసింది. సీజేఐ చంద్రచూడ్ తో సంప్రదింపులు జరిపిన
తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన జడ్జిల్లో
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఇద్దరు జడ్జిలు ఉండగా తెలంగాణ హైకోర్టుకు చెందిన
ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
హైకోర్టు నుంచి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, గుజురాత్ హైకోర్టుకు బదిలీ కాగా, జస్టిస్ దుప్పుల వెంకట రమణ(అదనపు న్యాయమూర్తి),
మధ్యప్రదేశ్ కు బదిలీ అయ్యారు. జస్టిస్
నరేందర్, కర్ణాటక హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయ్యారు.
తెలంగాణ
హైకోర్టు నుంచి జస్టిస్ మున్నూరి లక్ష్మణ్ , రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ కాగా,
జస్టిస్ జి అనుపమ చక్రవర్తి పాట్నా హైకోర్టుకు ట్రాన్సఫర్ అయ్యారు.
ఆంధ్రపదేశ్ హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జిలను నియమించారు. నూనెపల్లి
హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం
సిఫారుసు చేయగా, వారి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెల్లువడ్డాయి.