బ్రిటిష్ పోలీస్ అధికారిణి ఫ్రాన్స్‌లో
అత్యాచారానికి గురైంది. ఈఫిల్ టవర్
సమీపంలోని నైఫ్ పాయింట్ వద్ద ఆమెపై ఓ దుండుగుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు.
23 ఏళ్ల పోలీసు అధికారిణి, స్నేహితులతో
కలిసి ఈఫిల్ టవర్ ను వీక్షించేందుకు వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది.
సోమవారం
రాత్రి 11 గంటల సమయంలో ఆమెపై ఓ వ్యక్తి బలత్కారానికి పాల్పడినట్లు కేసు నమోదు
అయింది.
బాధితురాలు పొదల చాటున ఉన్న టాయిలెట్
కు వెళ్ళగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమెపై దూకాడు. ఆమె అక్కడి నుంచి తప్పించుకునే
ప్రయత్నంగా చేయగా కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ
35 ఏళ్ళ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మూడు నెలల కిందట కూడా ఇదే
తరహా ఘటన చోటుచేసుకుంది. 27 ఏళ్ళ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే అనుమానంపై
అరెస్టు అయిన ఇద్దరు వ్యక్తులు వెంటనే విడుదలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు లో కూడా అదే
ప్రాంతంలో ఓ మహిళ కిటికీ తెరిచి నిద్రిస్తుండగా ఓ అగంతకుడు జోరబడి కత్తితో
బెదిరించి బలత్కారం చేసినట్లు కూడా కేసు నమోదైంది.
ఫ్రాన్స్ లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా
జరుగుతుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఓ ఉపాధ్యాయిని కూడా ఇలాంటి ఘటననే
ఎదుర్కున్నారు. దీంతో 7 వేలమంది అదనపు పోలీసు సిబ్బందిని సమస్యాత్మక ప్రాంతాల్లో
మోహరించారు.