గాజాలోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న
పేలుడుపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్యుల మరణాలు
తీవ్రమైనవని ఆవేదన చెందిన మోదీ, బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేశారు.
గాజాలోని
అల్ అహ్లి ఆసుప్రతిలో పేలుడు జరగడంతో పెద్ద ఎత్తున సామాన్యులు మరణించడం తీవ్రంగా
కలిచివేసిందన్న ప్రధాని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
క్షతగాత్రులు
త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని, ఇజ్రాయెల్-హమాస్ పోరులో సామాన్యులు
ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరం అన్నారు. కారుకులకు శిక్షపడాలన్నారు. ఇజ్రాయెల్ పై హమాస్
దాడిని మొట్టమొదట ఖండించిన ప్రపంచదేశాల అధినేతల్లో ప్రధాని మోదీ ఒకరు.
గాజాలోని
ఓ ఆస్పత్రిలో మంగళవారం భారీ పేలుడు సంభవించి, దాదాపు 500 మంది మరణించారు. అయితే ఈ
ఘటనకు ఇజ్రాయెల్ కారణమని హమాస్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ వాదన మాత్రం
మరోలా ఉంది. హమాస్ ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్ గురి తప్పి ఆస్పత్రిపై పడిందని
చెబుతున్నారు. ఇజ్రాయెల్ –హమాస్ పోరులో భాగంగా సామాన్యులపై ఆకృత్యాలను ప్రపంచ
దేశాలు ఖండిస్తున్నాయి.