అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్)కేసు
లో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణను
హైకోర్టు వచ్చే నెల 7కు వాయిదా వేసింది. ఈ కేసులో నేటి వరకు చంద్రబాబును అరెస్టు
చేయవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా విచారణను నవంబరు 7కు
కోర్టు వాయిదా వేసింది. అలాగే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ విచారణపై కూడా హైకోర్టు
స్టే విధించింది. నేడు కూడా స్టేను నవంబర్
7 వరకు హైకోర్టు పొడిగించింది.
సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు
ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి తెలిపారు. తమకు అనుకూలంగా తీర్పు
వస్తే ఈ కేసులో కూడా వర్తిస్తుందని న్యాయవాదులు చెప్పారు. విచారణను నవంబర్‌కు
వాయిదా వేయాలని కోరారు. అప్పటి వరకు విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన పీటీ వారెంట్
ఉత్తర్వులపై విధించిన స్టేను పొడిగించాలని కోరింది. దీంతో న్యాయమూర్తి విచారణను
నవంబర్ 7కు వాయిదా వేశారు. పీటీ వారెంట్ పై స్టే ను కూడా పొడిగించారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ1 గా ఉండగా మాజీమంత్రి నారాయణ ఏ2 గా ఉన్నారు. ఇదే కేసులో
మరో మాజీమంత్రి లోకేశ్ ను ఇప్పటికే సీఐడీ రెండు రోజుల పాటు విచారించింది.