పాకిస్తాన్
ఆర్థిక పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఇప్పటికే ఆహార భ్రదత, నిరుద్యోగం, ఉగ్రవాదంతో అల్లాడుతున్న పాకిస్తాన్,
తాజాగా మరిన్ని కఠిన పరిస్థితులు ఎదుర్కుంటుంది.
నిధుల
లేమితో ఫ్యూయల్ నింపలేని పరిస్థితుల్లో విమాన సర్వీసులను రద్దు చేసుకోవాల్సిన
దారుణ పరిస్థితిలోకి వెళ్ళింది.
పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ)కు చెందిన 48
జాతీయ, అంతర్జాతీయ విమానాలు, విమానాశ్రయాలకు పరిమితమయ్యాయి.
ఫ్యూయల్
కొరత కారణంగా విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని, మరికొన్నింటినీ రీషెడ్యూల్
చేశామన్నారు. ఇప్పటి వరకు 13 దేశీయ, 11 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
చేసినట్లు చెప్పారు. రద్దు చేసిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ
ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
మరో 12 విమాన సర్వీసుల షెడ్యూల్ మార్చగా, 16
విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ చమురు సంస్థ(పీఎస్వో) పీఐఏకు ఇంధన
సరఫరా నిలిపివేయడంతో ఈ సంక్షోభం తలెత్తింది. రుణభారం పెరగడంతో పీఐఏను ను ప్రైవేటు
పరం చేసే ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం
రోజువారీ ఖర్చుల కోసం రూ.23 బిలియన్ల సాయం కావాలని పీఐఏ, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని
కోరింది. కానీ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వం నిరాకరించింది.
పాకిస్తాన్ తన చరిత్రో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని
ఎదుర్కోంటుంది. ఆ దేశంలో ద్రవ్యోల్బణం 21.3 శాతానికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు 10 బిలియన్ డాలర్ల
వద్ద అత్యత తక్కువ స్థాయిలో ఉన్నాయి.