తమిళనటుడు
విజయ్ హీరోగా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో మూవీ టైటిల్
వివాదంలో చిక్కుకుంది. దీంతో కోర్టు సినిమాను అక్టోబర్ 20 వరకు విడుదల చేయవద్దని
ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన నిర్మాత నాగవంశీ, తెలుగులో ఈ సినిమాను
ముందుగా ప్రకటించిన తేదీనే విడుదల చేస్తామని స్పష్టంచేశారు.
పిటిషన్
దారుడితో చర్చించి ఇద్దరికీ సమస్య లేకుండా పరిష్కరించుకుంటామని, సినిమాను 19న
ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు
ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
కమ్యూనికేషన్
గ్యాప్ కారణంగానే ఈ వివాదం రేగిందన్నారు.
త్రిష,
లోకశ్ కనగరాజ్, సంగీత దర్శకుడు అనిరుద్, హైదరాబాద్ లో నిర్వహించే ప్రమోషన్స్ లో
పాల్గొంటారని తెలిపారు.
లియో
సినిమా విడుదలకు థియేటర్ల సమస్య కూడా లేదన్న నిర్మాత నాగవంశీ, భగవంత్ కేసరి, టైగర్
నాగేశ్వరరావు సినిమాలకు ఎన్ని థియేటర్లు కావాలో అన్ని ఉన్నాయన్నారు.