పదో
తరగతి బాలికపై వాలంటీరు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏలూరు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
దెందులూరు
మండల పరిధికి చెందిన ఓ పదో తరగతి బాలికపై వాలంటీరు దారుణానికి ఒడిగట్టినట్లు
బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలికను
కొన్ని నెలలుగా వేధిస్తున్న సదరు వాలంటీరు.. రెండు నెలల కిందట ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్
కార్డులు కావాలంటూ ఇంట్లోకి వెళ్ళి లైంగికదాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో
పేర్కొన్నారు.
దసరా సెలవులు కావడంతో బాలిక పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ
అనారోగ్యానికి గురికావడంతో బాలికకు వైద్య పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలిందని
ఫిర్యాదులో పోలీసులకు తెలిపారు. ఈ విషయమై వాలంటీరును నిలదీయగా రూ.10 వేలు ఇస్తామని,
అబార్షన్ చేయించుకోమంటూ సమాధానం చెప్పాడన్నారు. దీంతో ఇరుకుటుంబాల మధ్య వివాదం జరిగిందన్నారు.
పెద్దల సమక్షంలో పెళ్ళికి ఒప్పుకుని, వివాహం రేపు అనగా పరారీ అయ్యాడని బాలిక
తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
తమ
బిడ్డకు జరిగిన అన్యాయంపై వివరించేందుకు దిశ పోలీసు స్టేషన్ కు వెళితే అధికారులు
లేరని ఫిర్యాదు తీసుకోలేదంటున్నారు. జగనన్నకు చెబుదాం, స్పందన, 112 కు ఫోన్ చేసి
ఫిర్యాదు చేశామని చెబుతున్నారు. పోలీసులు అక్టోబర్ 5న కేసు నమోదు చేశారంటున్నారు.
స్థానిక వైసీపీ నేతల ప్రోద్బలంతో వాలంటీరుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని
ఆరోపిస్తున్నారు.