ప్రపంచ క్రికెట్ వన్డేల్లో చిన్న జట్లు చెలరేగిపోతున్నాయి. ఇంగ్లాండ్ జట్టును మట్టికరిపించి ఆఫ్ఘన్ జట్టు చరిత్ర సృష్టించిన విషయం మరవక ముందే మరో జట్టు సత్తా చాటుకుంది. మంగళవారం ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో తలపడ్డ నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 69 బంతుల్లో 78 పరుగులు సాధించి జట్టుకు మంచి స్కోర్ సాధించడంలో అండగా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు మార్కో జాన్సన్ 2, ఎంగిడి 2 వికెట్లు తీసుకున్నారు.
246 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాప్రికా జట్టులో మిల్లర్ 52 బంతుల్లో 43 పరుగులతో రాణించాడు. బ్యాటింగ్లో రాణించిన వాండర్మెర్వ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్