దిల్లీ లో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర
అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరో అల్లు
అర్జున్, రాష్ట్రపతి ద్రౌపది ముర్మ చేతుల మీదగా జాతీయ ఉత్తమనటుడు పురస్కారం
అందుకున్నారు. పుష్ప చిత్రంలో నటనకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది.
అవార్డు తో పాటు ప్రశంసా పత్రాన్ని
అల్లు అర్జున్ కు అందజేసారు. ఈ పురస్కారం
దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా రికార్డు నెలకొల్పారు.
ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు,
పుష్ప సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను నేపథ్య సంగీతానికి
కీరవాణి, కొరియాగ్రఫీకి ప్రేమ్ రక్షిత్ అవార్డులు అందుకున్నారు. అలాగే కొండపొలం
సినిమా పాటకు చంద్రబోస్ కూడా జాతీయ అవార్డు అందుకున్నారు.
అవార్డు అందుకోవడానికి ముందు
మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్, ఫుష్ప
కమర్షియల్ చిత్రమని, అలాంటి చిత్రానికి జాతీయ అవార్డు రావడం నిజంగా డుబల్ అచీవ్మెంట్
అన్నారు. ఆనంతరం తెలుగులో పుష్ప
సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘తగ్గేదే లే’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.