తమిళ
హీరో విజయ్ నటించిన లియో తెలుగు వెర్షన్ విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు
కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ
చేసింది. అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ సినిమాను విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ సినిమా టైటిల్
విషయంపై ఉన్నఅభ్యంతరాల ఆధారంగానే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తీర్పులో
పేర్కొంది.
ఈ
సినిమా ప్రారంభ ప్రకటన నుంచీ వివాదాలు వెంటాడుతున్నాయి. తమిళనాడులో మార్నింగ్ షో
వివాదం ఎదురుకాగా, తాజాగా తెలుగులో విడుదల పై హైదరాబాద్ సిటీ కోర్టు తీర్పు ఇవ్వడం
చర్చనీయాంశంగా మారింది. విజయ్ హీరోగా త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో
బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కూడా నటించారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అక్టోబర్ 19న విడుదల
కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ చిత్రం మొదటి రోజు రూ.
100 కోట్లు వసూళ్ళు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లోకేశ్ కనగరాజ్
దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఏదో ఒక వివాదం
వెంటాడుతూనే ఉంది.
బెనిఫిట్ షోలకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కేవలం ఉదయం 9
గంటల తర్వాతే షో వేయాలని ఆదేశించింది. దీనిపై లియో నిర్మాతలు మద్రాస్ హైకోర్టును
ఆశ్రయించగా, దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది.