స్కిల్ స్కామ్ కేసు కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు వేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. చంద్రబాబు తరపు హరీష్ సాల్వే, సిద్దార్ధ్ లూధ్రా వాదనలు వినిపించారు. 17ఎ కింద గవర్నర్ అనుమతి తీసుకోవాలని, చంద్రబాబు విషయంలో అనుమతులు తీసుకోలేదని సాల్వే తన వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ కేసులో 2018లోనే సీబీఐ నోటీసులు ఇచ్చిందని, తరవాత సీఐడీ కేసు దర్యాప్తు ప్రారంభించిందని ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
చంద్రబాబును అరెస్ట్ చేసే వరకు ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదని హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. 17ఎ విషయంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పు, న్యాయ చరిత్రలో ల్యాండ్‌మార్క్‌గా నిలిచే అవకాశం ఉందని న్యాయ కోవిదులు భావిస్తున్నారు.